Thursday, April 29, 2010

ఐతే - అన్నీ వాచ్ లు ఒకే లాగా ఉండవు

Unique 
Watch 01 
కుసంత టైం ఎంతయ్యిందో సేప్పొచ్చు కదా... ఈ వాచ్ ల లో టైం ఎంత అయ్యిందో చెప్పగలరా.....ట్రై చెయ్యండి.....అన్నీ వాచ్ లు ఒకే లాగా ఉండవు...కొన్ని ఇలాగ కుడా ఉంటాయి...ఇంతకి ఏది నచ్చింది మీకు...

ఎలుక - చీస్ !

ఆహా....ఈ యాడ్ చూడండీ...టూ మచ్ ఉంది...ఇది ఒక చీస్ యాడ్...మీరు సౌండ్ తో పాటు వీడియో చూస్తే మీకు కూడా నచ్చుతుంది...

టాక్ టాక్...

ప్రకటనలు....ఇవి మనం ఏ సినిమా చుస్తున్నప్పుడో...లేక మంచి ప్రోగ్రాం చుస్తున్నప్పుడో వచ్చి డిస్టర్బ్ చేస్తాయి...కానీ కొన్ని ప్రకటనలని చూస్తే...నచ్చుతాయి...మా తమ్ముడు చిన్నప్పుడు...టీవీ లో ఆడ్స్ వస్తే చాలు...అతుక్కు పోయేవాడు టీవీ కి...హి హి హి....నాకు కొన్ని ఆడ్స్ చూస్తే చాలా నచ్చుతాయి...నాకు నచ్చినవి...కొన్ని ఇలా మీతో కూడా షేర్ చేసుకుందామని...

Wednesday, April 28, 2010

హెల్త్ విజన్

అన్నీ వ్యవస్థల లో టెక్నాలజీ ఉపయోగం...అవసరం...ఎక్కువ అవుతున్న తరుణం లో... భవిష్యత్తు లో మన ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉండొచ్చు....అదే మనం చూడబోయే ఈ హెల్త్ విజన్

ఫోటో - గమ్మత్తు !

camels
ఈ ఫోటో నేషనల్ జిఒగ్రఫిక్ చానల్ వాళ్ళు తీశారు..దీంట్లో ఒక స్పెషాలిటి ఉంది...ఈ ఫోటో ని కొంచెం పరిశీలిస్తే మీకే తెలుస్తుంది...
అదేంటబ్బ...అని ఆలోచిస్తున్నారా...ఈ ఫోటో ని హెలికాప్టర్ లోనుంచి తీశారు...నల్లగా కనపడేవి ఒంటెల నీడలు...ఆ నీడల పక్కనే ఒంటెలు కూడా ఉన్నాయి(చిన్న చిన్న గా కనపడుతున్నాయి)...నడుచుకుంటూ వెళ్తున్న ఒంటెల ఫోటో ని ఎంత గమ్మత్తు గా తీశారో కదా...

ఇది పిట్టా ? లేక మిమిక్రి ఆర్టిస్టా ?..

ఈ వీడియో లోని పిట్ట చూడండీ...ఆడ పిట్టల్ని ఆకట్టు కోవడానికి ఎన్ని రకాలు గా అది విన్న సౌండ్స్ అన్నీ చేస్తుందో...మొదట ఇది కూకబర అనే పిట్ట సౌండ్ చేసింది...ఎంత బాగా మిమిక్ చేసిందంటే...నిజం కూకబర నమ్మేసింది...తరువాత దాని విశ్వరూపం చుపిచ్చింది...కేమెర షట్టర్ సౌండ్..కార్ అలారం సౌండ్...చెట్లు నరికేటప్పుడు అది విన్న రంపం సౌండ్...ఇలా బోలెడన్ని...ఆశ్చర్యం గా ఉందా..నిజం మీరే చూడండీ...దీనికి బెస్ట్ మిమిక్రి ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వొచ్చు...

బాతు పిల్లలు...ఎక్కడ ?

Unlucky 
Ducklings 01
ఈ బాతు దాని పిల్లలు...ఒక చిన్న డ్రైనేజ్ కప్పు ని దాటుతున్నాయి...ఇందులో ఏంటి విషయం అంటారా..పాపం అవి దాటాక...ఎన్ని బాతు పిల్లలు మిగిలాయో చూడండీ...

కుందేలు - ఆత్మ హత్య

Bunny 
Suicide 01
బన్ని సూసైడ్ అనే కామిక్ పుస్తకం చూసారా...అందులోనివే ఇక్కడ ఉండే కొన్ని బొమ్మలు...బాగున్నాయి కదూ..దీంట్లో...ఒక కుందేలు ఇంకా బ్రతక కూడదు అని...చనిపోడానికి ట్రై చేస్తూ ఉంటుంది...ఆండి రిలే అనే అతని సృష్టే ఇది..
ఇంకా ఉన్నాయి..చూడండీ...

Tuesday, April 27, 2010

తినే తిండి కి జీవం వస్తే..

Living Food 01
ఫుడ్ ఫోటోగ్రఫీ గురించి ఎప్పుడైనా విన్నారా....ఇక్కడ చూడండీ....
ఇంకా ఉన్నాయి...

దెయ్యం తయారు చెయ్యడం ఎలా..!!

Wireframe Ghost 01
మీకు బోర్ కొడుతుందా...అయితే దెయ్యం ని ఎలా తయారు చెయ్యాలో చూద్దామా...ఊర్కినే ఎవరినైనా భయపెట్టాలి అనుకుంటున్నారా... అయితే ఫెన్సింగ్ కి వేసే మెష్ వైర్ మీ దగ్గర ఉంటే చాలు...దెయ్యం రెడీ...హ హ హ...

కావాలంటే మీరే చూడండీ ఈ దెయ్యం ఎలా చేశారో..ఎలా ఉందో...
ఇంకా ఉంది....

కొత్త కాన్సెప్ట్ లు

Cool 
Furniture 01
ఈ కొత్త కాన్సెప్ట్ లు బాగున్నాయి కదా....మరింకెందుకు ఆలస్యం...వెతికి తెచ్చుకుందామా....పైన ఉండే దిండు నా దగ్గర ఆల్రెడీ ఉందండోయ్...చాలా కంఫోర్ట్ ఉంటుంది....సూపర్ అంతే...



Cool 
Furniture 02



Cool 
Furniture 03


ఇంకా ఉన్నాయి....

బోర్డులు కీ-బోర్డులు

                              Cool 
Keyboards 01



Cool 
Keyboards 02



Cool 
Keyboards 03


ఎవరు దీన్ని గీసింది?

దక్షిణ ఆస్ట్రేలియా లోని మర్రీ నగరానికి 60 km ల దూరం లో..ఒక మనిషి లాంటి బొమ్మ ని భూమి పైన చెక్కారు..ఈ బొమ్మ 4km ల పొడవు ఉంది...ఇది ప్రపంచం లోనే ఇటు వంటి బొమ్మల లో అతి పెద్దది...వీటిని జియోగ్లిఫ్ అంటారు...ఇది ఎందుకు ఇంత పొపులర్ అయ్యింది అంటే...ఈ బొమ్మ ని ఎవరు ఎందుకు ఎప్పుడూ గీశారో తెలియదు గనుక....

fact image
శాటిలైట్ తీసిన ఫోటో 
fact image

Saturday, April 24, 2010

టాలెంట్

దీని గురించి వేరే చెప్పాలా...ఓ లుక్ వేయండి...

Friday, April 23, 2010

మెటల్ వైర్ ల తో భలే బొమ్మలు

Weird 
Gadget 01

మనం రోజూ వాడే వస్తువులతో...వైర్ ల తో చాలా బాగా చేశారు కదా..అమెరికా లోని ఇండియానా పొలిస్ కి చెందినా టెర్రీ అనే అతను కేవలం మెటల్ వైర్ లు..రోజూ వాడే వస్తువులతో..వీటిని సృష్టించాడు...ఇంకా ఉన్నాయి చూడండి...

ఓవెన్ లో సెల్ ఫోన్

అసలు సెల్ ఫోన్ ని మైక్రో వేవ్ ఓవెన్ లో పెట్టాలని వీడికి ఐడియా వచ్చింది చూడండీ...మీరు ట్రై చెయ్యకండి...
అసలు ఓవెన్ లో పెడితే ఏమి అవుతుంది సెల్ ఫోన్ కి అని ఆత్రుత గా ఉందా...అయితే మీరే చూడండీ...
అది పేలేసౌండ్ కూడా వినండి....
హ హ హ హ ...ఎంజాయ్ చేశారా...వీడెవడో చాలా బాగా ఫేకాడు కదండీ....ఫేక్ అయితే ఏంటి...విజువల్ ఎఫ్ఫెక్ట్ లు చాలా బాగా చేశాడు...చించేసాడంతే!!

అంతా చెక్క మయం

Wood House

ఇటాలియన్ ఆర్టిస్టు లివియో డి మర్చి కి చెక్క అంటే ఎంత ఇష్టం అంటే తన చుట్టు పక్కల ఉండే వస్తువులు అన్నింటిని చెక్క తో చేసేశాడు..ఇతనికి నీళ్ళల్లో తేలే..చెక్క తో చేసిన ఫెర్రారి F50 కూడా ఉంది...దీంట్లో ఇతను వెనిస్ నీళ్ళల్లో తేలుతుంటాడు...ఇతని చెక్క సరంజామా ని మీరే చూడండీ...

పగ - ది రివెంజ్

Animal 
Revenge 01

జంతువులు మన పైన రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే...ఇంకా ఏమేమి చేస్తాయి...హ హ హ..మిగతావి కూడా చూడండీ... 

తల లేని పుంజు...

విచిత్రాలు చూసి ఉంటాం....వింతలు జరుగుతుంటాయి....కానీ అద్భుతాలు చాలా అరుదు....అటువంటిదే...ఈ తల లేని పుంజు...నమ్మలేక పోతున్నారా...ఇది నిజం గా నిజం అండి...5 నెలల పుంజు ఇలాగ పేరు గడించింది...అది సెప్టంబరు నెల 1945 వ సంవత్సరం..విధి ఈ పుంజు కి ముందే రాసిపెట్టి ఉంది...ఒక పదునైన కత్తి తో దీన్ని కోసి బిరియాని వండుకుందాం అని ఆశ పడ్డాడు దాని యజమాని..అలాగే ఆ కత్తి తో దానిని కోశాడు..కానీ వండలేదు...ఎందుకంటే..దానిని కోసిన కొంచెం సేపటి తరువాత..అది పురుగుల్ని..గింజలని తినడానికి...నడుచుకుంటూ వెళ్ళింది...దాని తల దాని యజమాని దగ్గరే మర్చిపోయి తల లేకుండా నే వెళ్ళింది....మామూలు గా పుంజుల యొక్క రిఫ్లెక్స్ యాక్షన్లు బ్రెయిన్ స్టెం(బుర్ర కి వెళ్ళే ఒక లింకు) కంట్రోలు చేస్తుంది...ఈ పుంజు విషయం లో ఆ బ్రెయిన్ స్టెం సగం అలాగే ఉంది పోయింది దాని ఒక చెవు తో పాటు...ఆ పుంజు కి తిండి ఐ డ్రాపర్(కంటి లో చుక్కలు వేసుకునే ట్యూబ్ లాంటిది) తో ఇచ్చేవాళ్ళు...అలా ఆ పుంజు మరో 18 నెలలు బతకడమే కాదు..1 kg ఉండేది 3 - 4 kg ల వరకు పెరిగింది...అలా ఇది గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది...
ఈ పుంజు ఇప్పుడు లేక పోయినా కానీ..అది మనతో బతకడానికి అది చూపించిన సాహసం ని వదిలి పోయింది..
fact image

fact image

fact image

Thursday, April 22, 2010

వామ్మో...ఇలాగ కుడా తింటారా

వామ్మో ఇవి కూడా తింటారా...అదీ కాన్ ల లో పెట్టి...రక రకాల జంతువులని తింటారని తెలుసు కానీ..మరీ పార్ట్ లు పార్ట్ లు గా తింటున్నారు..ఇవి ప్రపంచం మొత్తం లో కాన్ ల లో పెట్టి అమ్మే...తినే కొన్ని వింత తిండి లు మాత్రమే...భయపడకండి...ఇక్కడ అందుకనే కొన్ని మాత్రమే పెట్టాను..హ హ హ....మీరే చూడండీ...



అప్పుడే అయిపోయాయి అనుకుంటున్నారా...ఇంకా కింద బోలెడన్ని ఉన్నాయి...చూసి తరించండి..

అద్దం కాదిది చక్కద్దం

చక్క ముక్కల తో చేసారు ఈ అద్దాన్ని ఎలా ఉంది...బాగుందా...మీక్కూడా కావాలా...
దీని ముందుకెళ్ళి నిలబడితే చాలు...దీని లో ఉండే కేమెర సహాయం తో..మీ ప్రతిబింబాన్ని...చిన్న చిన్న చెక్క ముక్కలలో చూపిస్తుంది...

Tuesday, April 20, 2010

మంత్రాల కి చింతకాయలు

మంత్రాల కి చింతకాయలూ రాలుతాయా అని నన్ను అడిగితే....అవును అని చెపుతాను....రీసెంట్ గా నేను రీసర్చ్ చేస్తున్న టాపిక్ ల తో...వేదాలలో చెప్పిన దాని ప్రకారం...నాకు తెలిసి వచ్చింది ఏంటంటే...మన వాళ్ళు పురాణ కాలం లో...వైబ్రేషన్ తెరపి వాడే వాళ్ళు...అంటే ధ్వని తరంగాల ద్వారా వ్యాధులని రూపు మాపడం కానీ...ఇంకేమైనా కార్యములను కానీ తలపెట్టడం...

మామూలు గా మనం మనసు శాంతి లేనపుడు కానీ...బడలిక గా ఉన్నప్పుడు కానీ..మూడ్ లేనప్పుడు కానీ...ఆహ్లాదమైన పాట కానీ రాగం కానీ వింటే...ఎలాగైతే మనకి బాగా అనిపిస్తుందో...అలాగే కొన్ని మంత్రాలు కరెక్ట్ గా ఉచ్చరిస్తే(రోజు కి ఇన్ని సార్లు...లేక నేల కి ఇన్ని సార్లు...అలా)..కొన్ని వ్యాధులని నయం చెయ్యొచ్చు....మీకు తెలుసో లేదో..కొత్తగా ట్యూమర్ లని కాన్సర్ లని నయం చెయ్యడానికి...వైబ్రేషన్ తెరపి చేస్తున్నారు...సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవని....అందుకే...ఏదైనా మంత్రాలూ కానీ..పద్యాలు కానీ చెప్పే అప్పుడు...ఉచ్చారణ కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు మన వాళ్ళు...ఎందుకో ఇప్పుడు అర్థం అయ్యింది కదండీ...

ఇంకా చెప్పాలంటే...కాంతి తరంగాలని లేసర్ ....అల్ట్రా వయొలెట్ రే...ఇలాగా...ధ్వని తరంగాలు కుడా...జస్ట్ frequency తేడాలు...అంతే....

ఇలా మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి....మన వేదాల్లో పురాణాల్లో...

Monday, April 19, 2010

పాస్ పోర్టు సైజు ఫోటోలు

మనం ఎప్పుడో ఒకప్పుడు పాస్ పోర్టు సైజు ఫోటో లు తీసుకునే ఉంటాము...పాస్ పోర్టు ఫోటో ల లో ముఖ్యం గా మొహం కనిపించాలి...ఇప్పుడు ఈ సోది ఎందుకు చెపుతున్నాను అంటే...మనకి మామూలు గా..ఏ సింహం ని గుర్తు తెచుకోవాలంటే దాని జూలు గుర్తొస్తుంది....అలాగే పులి అంటే దాని పైన ఉండే చారలు గుర్తొస్తాయి...అలాగే కోతి అంటే తోక గుర్తొస్తుంది...పాండా అంటే దాని నలుపు తెలుపు పెద్ద ఆకారం గుర్తొస్తుంది....కానీ...ఈ జంతువుల పాస్ పోర్టు ఫోటోలు తీస్తే ఎలా ఉంటుంది...అంటే జంతువుల ముఖం ఒక్కటే కనిపించేట్టు అనమాట...కొంచెం డిఫెరెంట్ గా ఫీల్ అవుతాం కదా...ఆ ఫీలింగు మీరు కూడా పొందండి...

కేక గీశాడు !

మనందరం ఎప్పుడో ఒకప్పుడు బొమ్మలు గీస్తూ ఉంటాము...కానీ ఈ టైపు లో ఎప్పుడైనా ట్రై చేశారా...వీడు చూడండీ కేక గీశాడు...అసలు నాకు మొదట్లో ఏం గీస్తున్నాడో అర్థం కాలేదు తరువాత అర్థమైంది కానీ...చివరి లో అసలు సూపర్ అంతే...మీరే చూడండీ....

మిస్సింగు లింకులు

మనం అందరమూ చిన్నప్పుడు చదువుకున్నాం కదండీ ...డార్విన్ సిద్ధాంతాలని...వాటి ఆధారం గా జంతు జాలం ఉద్భవించింది అంటే..ఈ కింద ఉన్న కొన్ని, మిస్సింగ్ లింకులు అన మాట..అంటే ఒక జంతువు ఇంకోలాగా మారడానికి దోహదం చేసిన స్పెసిస్...నిజం చెప్పాలంటే నేను డార్విన్ సిద్ధాంతాలను కంప్లీట్ గా నమ్మను...అందులో కొన్నే నిజాలు అని నా నమ్మకం...ఎంతైనా అది సిద్ధాంతమే కానీ ప్రూఫ్ కాదు కదండీ...ఇంతకి నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నాను అంటే...కింద చూడండీ మీకే అర్థం అవుతుంది...మిస్సింగు లింకులు అంటే ఏంటో...అవి ఎలా ఉంటాయో...


టిక్ టాలిక్: ది "ఫిషపోడ్"
దీన్ని అర్కిటిక్ కెనడా లో 2004 లో కనుగొన్నారు, ఇది 375 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించేది. దీనికి చేపల కి ఉండే గిల్స్ మరియు స్కేల్స్ యే కాకుండా..టెట్రాపోడ్ (భూమి పైన బతికే నాలుగు కాళ్ళ జంతువు) కి ఉండే లక్షణాలు...చేతుల్లాగా ఉండే ఫిన్స్..పక్కటి ఎముకలు..ఎటు కావాలంటే అటు తిరిగే మెడ...మొసలి లాగా ఉండే తల..కూడా ఉండేవి... 

క్రియేటివ్ ప్రకటనలు

ప్రతి రోజు మనం టీవీ లో కానీ రోడ్డు పైన కానీ...రక రకాల ప్రకటనలు చూస్తుంటాము...ఒక వస్తువు ఎంత బాగా హిట్ అయ్యిందో...ఎంత బాగా అమ్ముడుపోతుందో....ప్రకటనల పైన...చాలా వరకు ఆధారపడి ఉంటాయి....ఈ ప్రకటనలు డిజైన్ చెయ్యడం లో మినిమం నా లాంటి క్రియేటివిటి ఉన్న వాళ్ళు ఉండాలి...హి హి హి...(నేను కూడా కొంచెం క్రియేటివ్ ఏ లేండి).. 
ఈ కింద వాటి కాన్సెప్ట్ ని గొరిల్లా ఆడ్స్ అని అంటారు..నాకు ఇరగ నచ్చేశాయి..మీరు కూడా ఒక లుక్ వెయ్యండి...

వాక్యుం క్లీనర్ ప్రకటన


బస్సు లో బీరు ప్రకటన


మొబైల్ కరియర్ ప్రకటన



Sunday, April 18, 2010

పాపం కుక్కలు..

ఈ కుక్కల ని చూడండి...ఎలా చేశారో వీటిని...హ హ హ ...కుక్కల ఫాషన్ షో..








Saturday, April 17, 2010

కూసంత కళా పోసన

మనిసన్నాక కూసంత కళా పోసన ఉండాలి అన్నారు...కదా...ఈ కింద బొమ్మల్ని చూడండీ...పేపర్ ల తో ఎంత బాగా చేశారో...మీకే అర్థం అవుతుంది ఏ మాత్రం ఉందో కళా పోషణ....హ హ హ హ ....




"హనీ మూన్"

 
4000 ఏళ్ళ క్రితం బాబిలోన్ లో ఒక ఆచారం ఉండేది వాళ్ళకి...పెళ్లి అయిన తరువాత ఒక నెల వరకు, వధువు తండ్రి వరుడు కి తాగినంత "మీడ్" ని ఇవ్వాలి అంట......"మీడ్" అంటే తేనె తో తయారు చేసిన ఒక పానీయం...ఈ బాబిలోన్ వాళ్ళ కాలెండర్ చంద్రుడి ఆధారం గా ఉండేది....వాళ్ళు ఈ సమయాన్ని "హనీ మంత్" అనే వాళ్ళు...మనం ఇప్పుడు పిలుచుకుని....పులకరించే....."హనీ మూన్" అలా వచ్చిందే.....బాగుంది కదూ...."హనీ మూన్"...

మీకు తెలుసా - 2

సెలరి లో నెగటివ్ కేలరి లు ఉంటాయి...అంటే..మీరు ఒక ముక్క సెలరి తిన్నా కానీ...దాని వల్ల వచ్చే కేలరి ల కంటే...దాన్ని తినడానికే ఎక్కువ కేలరి లు ఖర్చు అవుతాయి...

చార్లీ చాప్లిన్ కి ఒకసారి "చార్లీ చాప్లిన్ లాగా ఎవరు ఉంటారు" అనే కాంటెస్ట్ లో 3 rd స్థానం వచ్చింది.
వెనకటి కి బెల్లింగం, వాషింగ్టన్ అనే ఊరు లో  నర్తించేటప్పుడు ఆడ వాళ్ళు వెనక్కి మూడు అడుగుల కంటే ఎక్కువ వేస్తే..అది చట్ట రిత్య నేరం.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే పుస్తకం పబ్లిక్ లైబ్రరి ల నుండి ఎక్కువ దొంగలించబడిన పుస్తకం గా రికార్డ్ ల కి ఎక్కింది.

ఇస్రాయిల్ పోస్టల్ స్టంప్ పైన ఉండే జిగురు కోషేర్ సెర్తిఫయ్ చెయ్యబడినది అంట...కోషేర్ అంటే జివిష్ మత ఆచారాలకి కట్టుబడి ఉండేవి అని అర్థం..

గబ్బిలాలు గుహల్లోంచి బయటికి వచ్చేప్పుడు ఎప్పుడూ ఎడమ వైపుకి తిరుగుతాయి..


Friday, April 16, 2010

అలసిపోయారా...అయితే ఇవి చూడండీ

మనం రోజు మొత్తం కష్టపడి...తీరా ఇంటికి వచ్చేటప్పటికి చాల అలసి పోయి ఉంటాము కదా...కానీ కొన్ని పాటిస్తే మనం మళ్లీ మన ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోగలము...ఇవి వినడానికి చాల చిన్న చిన్న విషయాలు గా అనిపిస్తాయి కానీ...చాల బాగా పనిచేస్తాయి...ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను...నిజం గా చాల బాగుంది...అందుకే రోజు లో ఎన్ని పనులు ఉన్న కానీ..చిరాకు లేకుండా..రెండు మూడు బ్లాగ్ లు రాస్తున్నాను...(అఫ్కోర్సు నాకు సైట్ డెవలప్ చేయ్యడమన్నా..బ్లాగ్లు రాయడామన్న ఇష్టం అనుకోండి...హి హి హి..అది వేరే విషయం)....సో పని మధ్య లో కానీ తరవాత కానీ ... మళ్లీ మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోడం కోసం....కాఫీ నే తాగక్కర్లేదు....ఈ కిందవి ఫాలో అయితే మరీ మంచిది...

వింత మౌస్ లు..ఎలుకలు కాదండోయ్

మనం రోజూ కంపూటర్ వాడేప్పుడు లేక లాప్ టాప్ లు వాడేప్పుడు కూడా మౌస్ లు వాడుతుంటాము కదా ..ఇప్పుడు కొన్ని వింత వరైటి మౌస్ లు చూద్దాం...మీకు ఏది నచ్చిందో ...చూడండీ...

ఇంకా చూడాలంటే కింద ఉన్న "READ MORE" క్లిక్ చెయ్యండి

Thursday, April 15, 2010

ప్రమాదకరమైన రోడ్లు

డెత్ రోడ్డు (బొలివియా)



లగ్జరీ బస్సు

ఈ బస్సు ని చూశారా ఎంత బాగుందో...ఒక చిన్న సైజ్ ఇల్లే దీంట్లో ఉంది...

ఇంకా చూడాలంటే కింద ఉన్న "READ MORE" క్లిక్ చెయ్యండి

7 రకాల పదార్ధాలు

మనకి తెలుసు మనం సమయం ఎక్కువ ఉండో లేక సమయం లేకనో మనకి అరిగే దానికంటే ఎక్కువ తినేస్తాం అని..కానీ కొన్ని తినే పదార్ధాల వల్ల మనం బరువు తగ్గుతాం మరియు కంట్రోల్ లో ఉంచుకో గలుగుతాం..మంచి డైట్ పాటించాలి అంటే ఈ కింద ఉండే 7 పదార్ధాలు తప్పనిసరి.....

#1.ఆపిల్ పళ్ళు
ఆంగ్లం లో ఒక సామెత ఉంది లెండి..."రోజుకో ఆపిల్ తింటే డాక్టర్లకి దూరం గా ఉండొచ్చు అంట..."..వాడి ఉద్దేశం లో ఆరోగ్యం గా ఉంటారు అని లెండి...వెధవకి కూసంత కళా పోసన ఎక్కువ...చిన్నప్పట్నుంచి..
మనం ఆరోగ్యం గా ఉండడమే కాదండోయ్ బరువు కూడా తగ్గుతాం...
ఇంకా చూడాలంటే కింద ఉన్న "READ MORE" క్లిక్ చెయ్యండి

బుర్ర తిక మక


ఒక సారి ఇది చేసి చూడండీ...మన బుర్ర కొన్ని కొన్ని పనులు చెయ్యలేదు....కన్ఫ్యూస్ అయిపోతుంది...

కావాలంటే మీరే చేసి చూడండీ...నేను కూడా అసలు నమ్మలేక పోయాను...ఈ కింద చెప్పినట్టు ట్రై చేస్తే మీ బ్రెయిన్ తిక మక పడిపోతుంది...మీరు ఎంత ట్రై చేసినా కానీ..మీ కాలిని మీ బుర్ర కంట్రోల్ లోకి తీసుకుని రాలేరు.....ఎందుకంటే ఇది ముందే మన బుర్ర లో ప్రీ ప్రోగ్రాం అయిపాయింది....


1. మీరు కూర్చున్న చోటు నుంచే, మీ కుడి పాదం ని పైకి గాల్లో కి లేపి కుడి వైపు గా అంటే క్లోక్ వైస్ లో గుండ్రం గా తిప్పండి...


2. మీ పాదం తిప్పుతూ ఉన్న సమయం లోనే, మీ కుడి చేత్తో '6' అంకె ని గాల్లో రాయండి....

తేడా గమనించారా మీ పాదం తిరిగే దిశ మారిపోతుంది...
"

Wednesday, April 14, 2010

వెండింగ్ మెషిన్లు

మనం ఎక్కడో ఒక చోట వెండింగ్ మెషిన్ లని చూసే ఉంటాము....ఏ చాక్లెట్ల కోసమో..టికెట్స్ కోసమో ..మనం వీటిని వాడి ఉంటాము...అటు వంటి వెండింగ్ మెషిన్ లు ఇలాగ కూడా ఉంది ఉంటె...హ హ హ ....చాల వింత గా ఉంటుంది కదా....ఇలాంటి వింత ఐడియా నే ఎవడికో వచినట్టుంది..వాడు వెంటనే ఈ కల్పిత ఫోటో లని శ్రుష్టించేసాడు...ఒక సారి చూసి మీరు కుడా వింత గా ఫీల్ అవ్వండి...హహహ ...


ఇంకా చూడాలంటే కింద ఉన్న "READ MORE" ని క్లిక్ చెయ్యండి