Tuesday, April 13, 2010

మీకు తెలుసా!


ఒక ఎలుక నీళ్ళు లేకుండా ఒంటె కంటే ఎక్కువ రోజులు ఉండగలదు.

మన పొట్ట ప్రతి రెండు వారాలకి ఒక కొత్త మూకస్ పొర ని తాయారు చేసుకుంటుంది..అలా చెయ్యకపోతే మన పొట్ట తనని తనే అరిగించేస్తుంది.

ఆంగ్లము లో 'i' అనే అక్షరము పైన ఉండే చుక్క ని టిటిల్ అంటారు.

ఒక ఎండు ద్రాక్ష ని ఒక గ్లాసుడు షంపైన్ లో వేస్తె అది ఆగకుండా ఆ గ్లాసు లోనే పైకి కిందకి గెంతుతూ ఉంటుంది.

ఫెర్రేట్ అనే జంతువులలో ని ఆడ ఫెర్రేట్ కి సమయానికి మగ ఫెర్రేట్ దొరక్క పోతే అది చనిపోతుంది.

ఉల్లిపాయలు తరుగుతున్నపుడు చువింగ్ గం నములుతుంటే మీ కంటిలోంచి నీళ్ళు రావు. 
ఇంకా చూడాలంటే "Read more" క్లిక్ చెయ్యండి

ఊబి లో పడినప్పుడు..కాళ్ళు చిన్నగా పైకి లేపుతూ వెల్లకిలా పడుకొని(వీపు ని ఆన్చుతూ) ఉండడానికి ప్రయత్నిస్తే మీరు మునగరు.

యావరేజ్ గా ప్రతి రోజు 12 మంది అప్పుడే పుట్టిన పిల్లల్ని పొరపాటున వాళ్ళ తల్లి తండ్రులకు కాకుండా వేరే తల్లి తండ్రులకు చేరవేయబడుతున్నారు. (వామ్మో అవునా....)

రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు లోహం అరుదుగా దొరికేది అందుకని ఆస్కార్ అవార్డులు చక్క తో చేసినవి బహుకరించే వాళ్ళు.

చదరంగం లో ఒక ఆటగాడి మొదటి నాలుగు అడుగులని 318,979,564,౦౦౦ రకాలు గా ఆడొచ్చు.

వ్యోమగాములని (Astronauts) సూన్యం లోకి వెళ్ళే ముందు బీన్స్ తిననిచ్చే వారు కాదంట ...మళ్లీ స్పేస్ సూట్ లోకి గాలి వెళ్తే స్పేస్ సూట్ పడిపోతుందని.(హ హ హ ...)

రెండవ ప్రపంచ యుద్ధం లో బెర్లిన్ పైన వేసిన మొదటి బాంబు ...బెర్లిన్ జూ లో ఉండే ఒకే ఒక్క ఏనుగు ని పొట్టనపెట్టుకుంది.(పాపం ఒక బాంబు కి ఒక ఏనుగు అంటే ఎన్ని బాంబులు కావాలో ...)

ఒక చుక్క మధు పానీయాన్ని తేలు పైన వేస్తె ..ఆ తేలు అప్పటికప్పుడే పిచ్చెక్కి దానిని అదే కుట్టుకుని చచ్చిపోతుంది.(ఇది కనిపెట్టిన ఆ మహానుభావుడు ఎవడో ?)

బ్రూస్ లీ ఫైట్లు చేసేటప్పుడు ఎంత ఫాస్ట్ గా కదిలే వాడంటే అతను ఏం చేస్తున్నాడో చూడడానికి ఫిలిం రీల్ స్లో చేసుకుని చూసే వాళ్ళు.

ఆంగ్లము లో సీతాకోకచిలుక అసలు పేరు బటర్ ఫ్లయ్(butter fly) కాదు .."ప్లటార్ బై (flutterby ).

మోటోరోల కంపెని మొదట కార్లకి వాటిలకి రికార్డు ప్లేయర్లు  తాయారు చేసేది ..ఆ సమయం లో ప్లేయర్ లు తాయారు చేసే దందా లో విక్టరోల అనే కంపెని ప్రాచుర్యం లో ఉంది ..అందుకని మోటోరోల కంపెని ..మోటోరోల అని పేరు పెట్టుకుంది.

గులాబీ పూలు ఎరుపు రంగు లో ఉండొచ్చు..ఉండకపోవచ్చు .....కాని వయొలెట్ పూలు మాత్రం వయొలెట్ రంగు లోనే ఉంటాయి.

No comments:

Post a Comment