Friday, April 23, 2010

తల లేని పుంజు...

విచిత్రాలు చూసి ఉంటాం....వింతలు జరుగుతుంటాయి....కానీ అద్భుతాలు చాలా అరుదు....అటువంటిదే...ఈ తల లేని పుంజు...నమ్మలేక పోతున్నారా...ఇది నిజం గా నిజం అండి...5 నెలల పుంజు ఇలాగ పేరు గడించింది...అది సెప్టంబరు నెల 1945 వ సంవత్సరం..విధి ఈ పుంజు కి ముందే రాసిపెట్టి ఉంది...ఒక పదునైన కత్తి తో దీన్ని కోసి బిరియాని వండుకుందాం అని ఆశ పడ్డాడు దాని యజమాని..అలాగే ఆ కత్తి తో దానిని కోశాడు..కానీ వండలేదు...ఎందుకంటే..దానిని కోసిన కొంచెం సేపటి తరువాత..అది పురుగుల్ని..గింజలని తినడానికి...నడుచుకుంటూ వెళ్ళింది...దాని తల దాని యజమాని దగ్గరే మర్చిపోయి తల లేకుండా నే వెళ్ళింది....మామూలు గా పుంజుల యొక్క రిఫ్లెక్స్ యాక్షన్లు బ్రెయిన్ స్టెం(బుర్ర కి వెళ్ళే ఒక లింకు) కంట్రోలు చేస్తుంది...ఈ పుంజు విషయం లో ఆ బ్రెయిన్ స్టెం సగం అలాగే ఉంది పోయింది దాని ఒక చెవు తో పాటు...ఆ పుంజు కి తిండి ఐ డ్రాపర్(కంటి లో చుక్కలు వేసుకునే ట్యూబ్ లాంటిది) తో ఇచ్చేవాళ్ళు...అలా ఆ పుంజు మరో 18 నెలలు బతకడమే కాదు..1 kg ఉండేది 3 - 4 kg ల వరకు పెరిగింది...అలా ఇది గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది...
ఈ పుంజు ఇప్పుడు లేక పోయినా కానీ..అది మనతో బతకడానికి అది చూపించిన సాహసం ని వదిలి పోయింది..
fact image

fact image

fact image

No comments:

Post a Comment