Thursday, April 15, 2010

7 రకాల పదార్ధాలు

మనకి తెలుసు మనం సమయం ఎక్కువ ఉండో లేక సమయం లేకనో మనకి అరిగే దానికంటే ఎక్కువ తినేస్తాం అని..కానీ కొన్ని తినే పదార్ధాల వల్ల మనం బరువు తగ్గుతాం మరియు కంట్రోల్ లో ఉంచుకో గలుగుతాం..మంచి డైట్ పాటించాలి అంటే ఈ కింద ఉండే 7 పదార్ధాలు తప్పనిసరి.....

#1.ఆపిల్ పళ్ళు
ఆంగ్లం లో ఒక సామెత ఉంది లెండి..."రోజుకో ఆపిల్ తింటే డాక్టర్లకి దూరం గా ఉండొచ్చు అంట..."..వాడి ఉద్దేశం లో ఆరోగ్యం గా ఉంటారు అని లెండి...వెధవకి కూసంత కళా పోసన ఎక్కువ...చిన్నప్పట్నుంచి..
మనం ఆరోగ్యం గా ఉండడమే కాదండోయ్ బరువు కూడా తగ్గుతాం...
ఇంకా చూడాలంటే కింద ఉన్న "READ MORE" క్లిక్ చెయ్యండి


#2 : వెల్లుల్లి పాయ
వెల్లుల్లి పాయ అన్నిటికంటే బాగా పని చేస్తుంది కొవ్వు కరిగించటం లో..
ఇది చెడు కొవ్వు నే కదండోయ్ క్రిముల్ని కూడా దూరం గా ఉంచుతుంది....

#3: టమాటాలు
టమాటాలు మనం రోజు వాడుతాం...వీటి వల్ల మన బరువు తగ్గడమే కాకుండా ...కేన్సర్ మరియు అధిక రక్త పోటు బారి నుండి కూడా కాపాడుతాయి...

#4: కేరెట్లు  
ప్రతి రోజు ప్రతి పూట...టిఫిన్ కానీ..భోజనం కానీ..తినే ముందు..ఒక కేరెట్ తిన్నాము అనుకోండి..ఫుల్ అయిపోతుంది తక్కువ అన్నం తింటాము... ఇంకా కేరెట్ లో ఉండే ఫిబెర్ ఒంటి కి కళ్ళకి కూడా మంచిది...ఇంకా ఎందుకు ఆలస్యం..ఒక 2 kg ల కేరెట్లు తెచ్చేసుకోండి.

#5: గజనిమ్మ..బత్తాయి....నారింజ
మీకు తెలిసిందే..ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది..కొవ్వు ని కరిగించే గుణం కూడా ఎక్కువే..వ్యాయామం కంటే రోజు ఇవి లాగించేస్తే సరి.

#6 : మామిడి పళ్ళు
వీటిల్లో ఫైబర్ ఎక్కువ ...కేలోరి లు తక్కువా...కుమ్మేయండి....మరీ ఎక్కువ తినకండోయ్ వేడి చేస్తుంది.

#7 : ఆకుకూరలు
ఆకుకూరల గురించి మీకు చెప్పాలా చెప్పండి...ఎంత తిన్నా కూడా మంచిదే....కంటి కి ..ఒంటి కి మంచిది...కేన్సర్ ల నుండి కుడా నిరోధిస్తుంది..ఐరన్ శాతం కూడా ఎక్కువే... 

ఇంకెందుకు ఆలస్యం పాటించేయండి..ఎక్కువ ఫైబర్ తక్కువ కేలరి లు..ఇంక సిక్స్ పాక్ లు...జీరో సైజ్ లు మీ సొంతం..

No comments:

Post a Comment