Monday, April 19, 2010

మిస్సింగు లింకులు

మనం అందరమూ చిన్నప్పుడు చదువుకున్నాం కదండీ ...డార్విన్ సిద్ధాంతాలని...వాటి ఆధారం గా జంతు జాలం ఉద్భవించింది అంటే..ఈ కింద ఉన్న కొన్ని, మిస్సింగ్ లింకులు అన మాట..అంటే ఒక జంతువు ఇంకోలాగా మారడానికి దోహదం చేసిన స్పెసిస్...నిజం చెప్పాలంటే నేను డార్విన్ సిద్ధాంతాలను కంప్లీట్ గా నమ్మను...అందులో కొన్నే నిజాలు అని నా నమ్మకం...ఎంతైనా అది సిద్ధాంతమే కానీ ప్రూఫ్ కాదు కదండీ...ఇంతకి నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నాను అంటే...కింద చూడండీ మీకే అర్థం అవుతుంది...మిస్సింగు లింకులు అంటే ఏంటో...అవి ఎలా ఉంటాయో...


టిక్ టాలిక్: ది "ఫిషపోడ్"
దీన్ని అర్కిటిక్ కెనడా లో 2004 లో కనుగొన్నారు, ఇది 375 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించేది. దీనికి చేపల కి ఉండే గిల్స్ మరియు స్కేల్స్ యే కాకుండా..టెట్రాపోడ్ (భూమి పైన బతికే నాలుగు కాళ్ళ జంతువు) కి ఉండే లక్షణాలు...చేతుల్లాగా ఉండే ఫిన్స్..పక్కటి ఎముకలు..ఎటు కావాలంటే అటు తిరిగే మెడ...మొసలి లాగా ఉండే తల..కూడా ఉండేవి... 

అర్కియోప్టేరిక్స్ :మొట్టమొదటి పక్షి 



దీని శిలాజం మొదట జర్మనీ లో 1861 లో బయట పడింది, ఇది 145 -150 మిలియన్ ఏళ్ళ కిందటిది.

అంఫిస్టియం : ది హాఫ్ వే ఫ్లాట్ ఫిష్ 
ఈ 50 మిలియన్ ఏళ్ళ శిలాజం ని 2008 లో కనుగొన్నారు..దీనిలో ప్రత్యేకత ఏంటంటే...మాములుగా చేపలకి రెండు వైపులా ఒక్కొక్క కన్ను ఉంటుంది...కానీ దీనికి...రెండు కళ్ళు ఒకే వైపున ఉన్నాయి..అందుకే ఇది మిస్సింగ్ లింక్ అయ్యింది....

ఆంబులోసేటస్ : నడిచే తిమింగలం

ఇది 50 మిలియన్ ఏళ్ళ కిందటిది...1992 లో పాకిస్తాన్ లో బయట పడింది...ఇది నాలుగు కాళ్ళ పైన నడిచేది...నీళ్ళ లోను..భూమి పైన కూడా ఉండేది..
హోమో ఏర్గాస్టర్ :  ది "తుర్కాన బాయ్" స్పెసిస్ 
హోమో ఎర్గాస్టర్ (మ్యూసియం లో) పొడవైన శరీరం...చిన్న బుర్ర ఉండే మనిషి జాతికి దగ్గర గా ఉండే స్పిసీస్ ... 1984 లో 1.6 మిలియన్ ఏళ్ళ క్రితం జీవించిన ఒక పిల్లోడి పురాతన శిలాజం తుర్కాన లేక్ దగ్గర దొరికింది...అందుకే దీనిని తుర్కాన బాయ్ అని కూడా పిలుస్తారు.
హైరకతేరియం :నక్క లాంటి గుర్రం 
ఈ నక్క లాంటి గుర్రం శిలాజం ని 1867 లో అమెరికా లో వెలికి తీశారు.
త్రినా క్సోడన్: ది ఎమర్జింగ్ మామల్
దీని శిలాజం ని సౌత్ ఆఫ్రికా మరియు అంటార్క్టికా ప్రాంతాల లో కనుగొన్నారు...ఇది రాక్షస బల్లుల కాలం నుంచి ఉద్భవించిన మొదటి మామల్ (అంటే గుడ్లు కాకుండా పిల్లలు పెట్టి పాలు ఇచ్చేది...తెలుగు లో ఏమంటారో గుర్తు రావట్లేదు) గా అనుకుంటున్నారు...ఇది 245 మిలియన్ ఏళ్ళ నాటిది...

5 comments:

  1. wow చాలా బాగున్నాయండీ, మీరివన్నీ ఎక్కడ collect చేసారో వివరిస్తే ఇంకా బాగుంటుంది. తెలియని ఎన్నో విషయాలు తెలియజేసారు కృతఙ్ఞతలు. మామల్ ని తెలుగులో క్షీరదం అంటారు.

    ReplyDelete
  2. thnq soo much sowmya gaaru....naaku mysteries...ufo..aliens..astronomy interests andi...soo ilaa browse chestu unte...dorikinavi..collect chesukuni pettukuntanu....naa "Dreamer Web" ane english site kuda undi..soo daani kosam ani kuda vetukutu untanu....

    ReplyDelete
  3. thnq for ksheeradam andi....anni padalu telugu lo gurthu raaka tala baadukuntunnanu daily...:P

    ReplyDelete
  4. baavundandi...mee blog regular ga follow avutunna..nice collection...

    rajkumar

    ReplyDelete
  5. @raj kumar...thnq soo much andi...:)

    ReplyDelete