Saturday, April 17, 2010

మీకు తెలుసా - 2

సెలరి లో నెగటివ్ కేలరి లు ఉంటాయి...అంటే..మీరు ఒక ముక్క సెలరి తిన్నా కానీ...దాని వల్ల వచ్చే కేలరి ల కంటే...దాన్ని తినడానికే ఎక్కువ కేలరి లు ఖర్చు అవుతాయి...

చార్లీ చాప్లిన్ కి ఒకసారి "చార్లీ చాప్లిన్ లాగా ఎవరు ఉంటారు" అనే కాంటెస్ట్ లో 3 rd స్థానం వచ్చింది.
వెనకటి కి బెల్లింగం, వాషింగ్టన్ అనే ఊరు లో  నర్తించేటప్పుడు ఆడ వాళ్ళు వెనక్కి మూడు అడుగుల కంటే ఎక్కువ వేస్తే..అది చట్ట రిత్య నేరం.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే పుస్తకం పబ్లిక్ లైబ్రరి ల నుండి ఎక్కువ దొంగలించబడిన పుస్తకం గా రికార్డ్ ల కి ఎక్కింది.

ఇస్రాయిల్ పోస్టల్ స్టంప్ పైన ఉండే జిగురు కోషేర్ సెర్తిఫయ్ చెయ్యబడినది అంట...కోషేర్ అంటే జివిష్ మత ఆచారాలకి కట్టుబడి ఉండేవి అని అర్థం..

గబ్బిలాలు గుహల్లోంచి బయటికి వచ్చేప్పుడు ఎప్పుడూ ఎడమ వైపుకి తిరుగుతాయి..



మగవాళ్ళు ఆడవాళ్ళు చదవ గలిగే దాని కంటే చిన్న అక్షరాలు(ప్రింట్ చిన్నది) చదవగలరు...అదే ఆడవాళ్ళు వినడం లో బెటర్ ..చిన్న శబ్దములు కూడా బాగా వినిపిస్తాయి అంట..

మీరు మీ మోచేతిని నాకడం చేయలేరు ...(పక్క వాళ్ళది ట్రై చేస్తే తంతారు..హి హి హి)

అలాస్క లో ఎక్కువ మంది జనాలు ఇప్పటికి వర్క్ కి వెళ్ళేప్పుడు నడిచి వెల్తారంట.

తెలివైన వాళ్లకి వారి జుట్టు లో ఎక్కువ జింక్ మరియు కోపర్ ఉంటాయంట.

టైపు మెషిన్ పైన రాసిన మొదటి నవల : టోమ్ సాయర్.

111,111,111 x 111,111,111 = 12,345,678,987,654,321

మనం చూస్తూ ఉంటాం పార్కు ల లో కానీ జంక్షన్ ల లో కానీ గుర్రాల పైన ఉండే రాజుల విగ్రహాలు...ఆ విగ్రహం లోని గుర్రం ముందు రెండు కాళ్ళు గాల్లో పైకి లేపి ఉంటే...ఆ విగ్రహం లోని ఆయన లేదా ఆమె యుద్ధం లో చనిపోయారని అర్థం...అదే అతను యుద్ధం లో తగిలిన దెబ్బల తో తరువాత చనిపోతే గుర్రం యొక్క ఒక ముందు కాలు గాల్లో ఉంటుంది....అదే గుర్రం యొక్క నాలుగు కాళ్ళు నేల పైన ఉంటే మామూలు కారణాల వల్ల చనిపోయారని అర్థం...అసలు గుఱ్ఱము విగ్రహము రెండు లేక పోతే ఇంకా బతికే ఉన్నాడని అర్థం...హి హి హి హి ...ఈ మధ్య బతికి ఉన్న కానీ విగ్రహాలు కట్టించు కుంటున్నారు లెండి...

 సగం మంది కి పైగా అమెరికన్ లు వాళ్ళు పుట్టిన ప్రదేశం నుండి 50 మైళ్ళ చుట్టు పక్కలే నివసిస్తారు.

 ఆంగ్లం లో నంబర్స్ అక్షరముల లో రాసేప్పుడు 'One Thousand' వరకు 'A' అనే అక్షరం కనపడదు...

  బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లు, ఫైర్ ఎస్కేప్ లు, కారు అద్దాలు తుడిచే  విపెర్ లు(Windshield wipers), మరియు లేసర్ ప్రింటర్ లు వీటన్నింటి ఒక కామన్ విషయం ఉంది...ఏంటో తెలుసా....ఇవి అన్నీ ఆడవాళ్ళు కనిపెట్టినవే...

 తేనె అనేది ఒక్కటే ఎప్పటికి పాడు అవ్వదు...ఈజిప్ట్ పిరమిడ్ లను వెలికి తీసేప్పుడు అందులో తేనే కూడా దొరికిందంట..అది ఇప్పుడు కూడా తాగే లాగానే చెక్కు చెదరకుండా ఉందంట....

2 comments:

  1. nice. it is better to remove word verification.

    ReplyDelete
  2. oops...sry...i dnt check tat....ippudu teesesanu ga....:)....frm now no word verification..jeevani garu....thnq

    ReplyDelete