Wednesday, April 14, 2010

రెండే ప్రశ్నలు...



ప్రశ్న 1:

మీకు ఒక ఆమె తెలుసు...ఆమె ఇప్పుడు గర్భవతి...ఆమెకు ఇది వరకే
 8 మంది పిల్లలు ఉన్నారు ....అందులో 3 చెవిటి వాళ్ళు....2 గుడ్డి 
 వాళ్ళు.....ఒకరు మతి స్థిమితం లేని వాడు......ఆమెకు సిఫిలిస్ అనే 
 వ్యాధి కుడా ఉంది.......మీ ఉద్దేశం లో ఆమె ఇప్పుడు గర్భం 
 తీయిన్చుకోవాలా... వద్దా ....???
  

జవాబు చూసే ముందు రెండవ ప్రశ్న కూడా చూడండీ......



ప్రశ్న 2 :

మీరు ఇప్పుడు ఒక ప్రపంచ అధినేత ని ఎన్నుకోవాలి....మీ వోట్ మీదనే ఆధారపడి ఉంది....కింద ఆ ముగ్గురు అభ్యర్ధుల గురించి ఉంది...

అభ్యర్ధి 1 : వంకర బుద్ధి గల రాజకీయ నాయకుల తో సహవాసం చేస్తాడు.....జాతకాల పిచ్చోడు....నోట్లో సిగరెట్ లేకుండా ఉండడు....ఇద్దరు భార్యలు...రోజుకి 8 -10 పెగ్గులు లాగిస్తాడు.

అభ్యర్ధి 2 : ఈయన పని చేసే ఆఫీసు నుండి రెండు సార్లు సుస్పెండు అయ్యాడు...మిట్ట మధ్యానం వరకు నిద్ర లేవడు...చదువుకునేప్పుడు మాదక ద్రావ్యాలకి బానిస....ప్రతి రోజు అర సీసా మందు అయిపిస్తాడు...

 అభ్యర్ధి 3 : ఈయన యుద్ధ రంగం లో కధానాయకుడు...మాంసము ముట్టడు....ఎప్పుడైనా ఒక బీరు తాగుతాడు...సిగరెట్ అసలు అలవాటు లేదు...తన భార్య ని ఎప్పుడూ మోసం చేయలేదు.

మరి మీరు వీళ్ళ ముగ్గురి లో ఎవరిని ఎంచుకుంటారు...?


జవాబుల కోసం కింద ఉన్న "READ MORE" ని క్లిక్ చెయ్యండి  


జవాబు 2 :

అభ్యర్ధి 1 - ఫ్రాంక్లిన్ డి రూస్ వెల్ట్ (అమెరికా 32 వ ప్రెసిడెంట్)

     అభ్యర్ధి 2 - విన్స్టన్ చర్చిల్ (ఇంగ్లాండ్ యొక్క గొప్ప రాజకీయ నాయకుడు )

అభ్యర్ధి 3 - అడాల్ఫ్ హిట్లర్ (ఈయన ఎవరో మీ అందరికి తెలుసు)


జవాబు 1 :
మీ జవాబు గర్భం తీయించెయ్యాలి అని చెప్పి ఉంటె ...ప్రపంచం "బీతొవెన్" అనే గొప్ప సంగీత విద్వాంసుడిని కోల్పోయి ఉండేది. 

ఆశ్చర్యం గా ఉందా....?

"ఒకరిని అంచనా వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి."

4 comments: