Friday, April 16, 2010

అలసిపోయారా...అయితే ఇవి చూడండీ

మనం రోజు మొత్తం కష్టపడి...తీరా ఇంటికి వచ్చేటప్పటికి చాల అలసి పోయి ఉంటాము కదా...కానీ కొన్ని పాటిస్తే మనం మళ్లీ మన ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోగలము...ఇవి వినడానికి చాల చిన్న చిన్న విషయాలు గా అనిపిస్తాయి కానీ...చాల బాగా పనిచేస్తాయి...ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను...నిజం గా చాల బాగుంది...అందుకే రోజు లో ఎన్ని పనులు ఉన్న కానీ..చిరాకు లేకుండా..రెండు మూడు బ్లాగ్ లు రాస్తున్నాను...(అఫ్కోర్సు నాకు సైట్ డెవలప్ చేయ్యడమన్నా..బ్లాగ్లు రాయడామన్న ఇష్టం అనుకోండి...హి హి హి..అది వేరే విషయం)....సో పని మధ్య లో కానీ తరవాత కానీ ... మళ్లీ మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోడం కోసం....కాఫీ నే తాగక్కర్లేదు....ఈ కిందవి ఫాలో అయితే మరీ మంచిది...

 
#1. సాక్స్ మార్చండి 
 కొంచెం వింత గా ఉంది కదా..మీరు విన్నది కరెక్టే...వర్క్ కి వెళ్ళేప్పుడు ఇంకో జత సాక్స్ తీసుకెళ్ళండి...మధ్యానం 3 pm ఆ టైం లో కొంచెం అలసి పాయినట్టు ఉంటారు కదా..అప్పుడు మార్చండి సాక్స్...మీరే చూస్తారు తేడా..ఈ చిట్కా మీరు కొంచెం ఎక్కువ నడిచే పని ఉంటె ఇంకా బాగా పని చేస్తుంది...

#2. వ్యాయామ సమయాలు మార్చుకోండి 
మీరు రాత్రి పూట వ్యాయామం చేస్తుంటే ఆ సమయం మార్చుకోండి...ఎందుకంటే స్టడీస్ ఆధారం గా...ఎవరైతే వారి నిద్ర వేళలకి దగ్గరి సమయాల్లో వ్యాయామం చేసినట్టు అయితే..వారి బుర్ర లో స్ట్రెస్ హార్మోన్ లు విడుదల అవుతాయి...వాటి వలన మీ నిద్ర కి భంగం కలుగుతుంది...మీరు రాత్రి పూట వ్యాయామం చేసి సగం నిద్ర తో పక్క రోజు పొద్దున్న అలసిపోయినట్టు ఉంటే..ఆ వ్యాయామం ఎందుకు...చాల మంది రాత్రి భోజనం చేశాక అరగాలి అని చెప్పి..ఓ తిరిగేస్తూ ఉంటారు..అందుకని మీ వ్యాయామ వేళల ని..మార్చి చూడండీ...


#3. చియా గింజలు తినండి
పురాణ కాలం లో అజ్టేక్ లు ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ చేసుకోడానికి ఇవి తినే వారంట...వీటి తో పాటు బాదం పప్పు నీళ్ళల్లో నానా పెట్టి తింటే కూడా మంచిది.... 

#4 . నిమ్మ వాసన పీల్చండి 
రీసర్చ్ ల లో ఏం తెలిసిందంటే సిట్రస్ వాసన(అంటే నిమ్మ జాతి కి చెందినా ఏదైనా వాసన) పీల్చడం వలన అలెర్ట్ గా ఫ్రెష్ గా ఉంటారు...మరి సిట్రస్ స్సెంట్ కలిగిన లోషన్..నూనె...పెర్ఫుమే వంటివి కూడా మీ లిస్టు లో చేర్చండి...  

#5. మీ కాలి వేళ్ళ పైన నిలబడండి 
మీకు నిద్ర పోవాలి అనుకోండి...మీ కాలి వేళ్ళ పైన నిలబడండి..అటు ఇటు మీ కాలి వేళ్ళ పైన రెండు అడుగులు వేయండి...ఇలా చేస్తే మీ రక్తం ఫ్లో పెరిగి..మీ ఒంట్లో ని అన్నీ ప్రదేశాలకి గ్లుకోస్ మరియు ప్రాణ వాయువు అందుతాయి...ఇలా అందడం వలన..యాక్టివ్ గా ఫ్రెష్ గా ఉంటారు.. 


మరి ట్రై చేసి చూడండీ....మీకు వర్క్ అవుతున్నాయో లేదో....

                                                            

No comments:

Post a Comment